సాయి తేజ్ – దేవ కట్టా ల మూవీకి టైటిల్ ఫిక్స్..!

దేవ కట్టా డైరెక్షన్లో రూపొందే సినిమాలన్నీ ఓ సామజిక అంశంతోనే రూపొందుతుంటాయి. దాంతో పాటు అందరినీ ఆలోచింపచేసే డైలాగులు కూడా ఉంటాయి. తాను చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెబుతూనే.. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడం ఈ దర్శకుడు స్టైల్. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి తేజ్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దేవ కట్టా. ఇది కూడా సామాజిక అంశంతో కూడుకున్న పొలిటికల్ డ్రామానే అని తెలుస్తుంది.

ఈ చిత్రంలో సాయి తేజ్ యంగ్ ఐ.ఏ.ఎస్‌ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.నిజానికి ఈ కథని మొదట మెగాస్టార్ చిరంజీవికి వినిపించాడట దేవ కట్టా. ఆయనకి ఈ కథ బాగా నచ్చింది. తేజు అయితే కరెక్ట్ గా సరిపోతాడు అని సూచించి.. అతనిని ఈ ప్రాజెక్టుకి ఒప్పించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కోసం ఓ ఆసక్తికరమైన టైటిల్‌ ను కన్ఫర్మ్ చేసారని టాక్.అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘రిపబ్లిక్’‌ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట.

ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆమె పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట.ఈ సినిమా కోసం ఆమె భారీగా పారితోషికాన్ని అందుకుంటున్నట్టు కూడా సమాచారం. ‘శ్రీ బాలాజీ సినీ మీడియా’ బ్యానేర్ పై ఈ చిత్రం రూపొందుతోంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus