SSMB28: మహేష్ త్రివిక్రమ్ మూవీ క్లాస్ మూవీ కాదా?

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని పూజా హెగ్డే ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కథకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ అని బోగట్టా. తమ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా సినిమా నిరాశపరిచిన నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ తో మహేష్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ టచ్ కచ్చితంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్టాఫ్ లో లవ్, ఫ్యామిలీ, ఫన్ కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని బోగట్టా.

సెకండాఫ్ మాత్రం మాస్, యాక్షన్ సన్నివేశాలతో ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అనుకున్న విధంగా షూటింగ్ జరిగితే ఈ సినిమా సమ్మర్ లోనే థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. థమన్ ఈ సినిమాకు సంబంధించిన వర్క్ ను మొదలుపెట్టారని తెలుస్తోంది. మహేష్ థమన్ కాంబో కూడా సూపర్ హిట్ కాంబో అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని మహేష్ అభిమానులు భావిస్తుండగా మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. తన శైలికి భిన్నమైన కథతో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. వరుస సక్సెస్ లతో జోరుమీదున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత ప్రాజెక్ట్ లు సైతం విజయం సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus