Mahesh28: ‘మహేష్ 28’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఇది ఫైనల్ అట..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ వారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొన్ననే ఫస్ట్ షెడ్యూల్ కూడా దుబాయ్ లో పూర్తయ్యింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు కావడం విశేషం. ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేసేది ఇంకా ఫైనల్ కాలేదు.

అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే తన సినిమా మహేష్ బాబుతోనే అని రాజమౌళి స్పష్టం చేశారు. ఎలాగూ అతను ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటాడు కాబట్టి.. ఈ గ్యాప్లో ఓ సినిమా చేసెయ్యాలని మహేష్ డిసైడ్ అయ్యాడు. అందుకు త్రివిక్రమ్ బెస్ట్ ఛాయిస్ అని భావిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చెయ్యాలి త్రివిక్రమ్. కానీ ఇప్పుడది ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో మహేష్ తో సినిమా చేసేస్తే బెటర్ అని త్రివిక్రమ్ కూడా భావిస్తున్నాడట. దాదాపు ఈ ప్రాజెక్టు ఖరారు అయిపోయిందని వినికిడి. అనౌన్స్మెంట్ కూడా కృష్ణగారి బర్త్ డే రోజున ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. హీరోయిన్ గా కృతి శెట్టి లేదా పూజా హెగ్డే లలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్. చూద్దాం ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజముందో..!

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus