Anaganaga Oka Raju Collections: ‘అనగనగా ఒక రాజు’ ఇప్పటివరకు లాభాలు ఎంతంటే?
- January 27, 2026 / 12:25 PM ISTByPhani Kumar
నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా.
Anaganaga Oka Raju Collections
టీజర్, ట్రైలర్స్ వంటివి ఆకట్టుకోవడం.. అలాగే నవీన్ పోలిశెట్టి వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉండటం పైగా ప్రమోషనల్ కంటెంట్లో సంక్రాంతి పండుగ వైబ్స్ ఉండటంతో.. ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు పెరిగాయి.

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. పండుగ సెలవులు ముగిసినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. ఒకసారి 12 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 11.17 cr |
| సీడెడ్ | 3.66 cr |
| ఉత్తరాంధ్ర | 6.50 cr |
| ఈస్ట్ | 3.36 cr |
| వెస్ట్ | 1.87 cr |
| గుంటూరు | 2.63 cr |
| కృష్ణా | 2.19 cr |
| నెల్లూరు | 1.28 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 32.66 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.78 cr |
| ఓవర్సీస్ | 8.39 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 43.83 కోట్లు |
‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) సినిమాకి రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.28 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 12 రోజులు పూర్తయ్యేసరికి రూ.43.83 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.83.38 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు రూ.16.83 కోట్ల లాభాలు అందించింది.
థియేటర్లు తక్కువ.. అయినా 11వ రోజు కోటి కొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’
















