Anaganaga Oka Raju: స్పీడ్ పెంచిన నవీన్ పోలిశెట్టి.. థియేటర్లో కనిపించేది ఎప్పుడు?

నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)  అభిమానులంతా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) సినిమా షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ అవుతున్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty) తో హిట్ అందుకున్న నవీన్, ఆ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్య చిన్న యాక్సిడెంట్ జరిగినా.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆయన తిరిగి సెట్స్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే, నవీన్ కొత్త ప్రాజెక్ట్స్‌పై స్పష్టత లేకపోవడం అభిమానులను కాస్త నిరాశపరిచినా, ఇప్పుడు అనగనగా ఒక రాజు పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయనే అప్డేట్ మాత్రం వారిని ఎగ్జైట్ చేస్తోంది.

Anaganaga Oka Raju

ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ గతేడాది నవీన్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవీన్ స్టైల్ కామెడీ, కొత్త కాన్సెప్ట్ కావడంతో సినిమా మీద అటెన్షన్ బాగా క్రియేట్ అయింది. అయితే సినిమా పనులకు ఇంకాస్త టైమ్ పడుతుందా అని డౌట్స్ ఉన్న సమయంలో సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుండటం ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. తాజా బజ్ ప్రకారం, మార్చి 2 నుంచి అనగనగా ఒక రాజు కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో జరగనుంది.

రాజమండ్రి బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని కీలకమైన సీన్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హీరో-హీరోయిన్ మధ్య వచ్చే కొన్ని ఫన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ దాదాపు వారం రోజుల పాటు జరగనుండగా, హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కూడా ఈ పార్ట్‌లో పాల్గొననుంది. ఇక దీంతో 40% షూటింగ్ పూర్తవుతుందట. మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ షెడ్యూల్ మధ్యలోనే మార్చి 4న మీనాక్షి చౌదరి తన బర్త్‌డేను సినిమా సెట్స్‌లో జరుపుకోనుంది.

ఈ చిత్రాన్ని నాగ వంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కథ, కాన్సెప్ట్, నవీన్ కామెడీ టైమింగ్‌ను బట్టి చూస్తే ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) 2025లో మంచి కామెడీ ఎంటర్టైనర్‌గా నిలవనుందనిపిస్తోంది. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, ప్రొడక్షన్ స్పీడ్ పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని టాక్. అనుకున్నట్లు పనులు కొనసాగితే సెప్టెంబర్ నెలలో సినిమా విడుదల కావచ్చని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus