అనుష్క బాటలో అనైక..!!

  • July 27, 2016 / 08:33 AM IST

వేశ్య పాత్రలు చేయడానికి కథానాయికలు వెనుకాడడం లేదు. హీరోయిన్ గా నటిస్తూనే స్వీటీ అనుష్క వేదంలో సెక్స్ వర్కర్ గా నటించి మెప్పించింది. పవిత్ర లో శ్రియ, జ్యోతిలక్ష్మీలో ఛార్మి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీరి బాటలో అనైక నడుస్తోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  “సత్య -2” సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ భామ 365 డేస్ చిత్రంలోనూ అందాలు ఆరబోసింది.

అయినా గుర్తింపు రాకపోయేసరికి వేశ్య పాత్రకు సై అనింది. తమిళ చిత్రం సెమ్మ బోధ అగాద (అతిగా తాగొద్దు) కోసం చేస్తున్న ఈ పాత్ర అయినా తనకి మరిన్ని అవకాశాలు తీసుకొస్తుందని ఆశలు పెట్టుకుంది. నటుడు అధర్వ నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. దర్శకుడు బద్రి వెంకటేశ్ వేశ్య పాత్రలో నటించమని ఎంతో మందిని సంప్రదించారంటా.. ఎవరూ అంగీకరించలేదని, అనన్య ఒప్పుకోవడంతో వేగంగా చిత్రీకరణ పూర్తి చేసినట్లు సమాచారం. అనైక కు ఒక మంచి పాట కూడా ఉందని తెలిసింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుపుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus