Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » “పుష్పక విమానం” చిత్రంలో పెళ్లి గురించి ఓ మంచి విషయం చెబుతున్నాం: హీరో ఆనంద్ దేవరకొండ

“పుష్పక విమానం” చిత్రంలో పెళ్లి గురించి ఓ మంచి విషయం చెబుతున్నాం: హీరో ఆనంద్ దేవరకొండ

  • November 10, 2021 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“పుష్పక విమానం” చిత్రంలో పెళ్లి గురించి ఓ మంచి విషయం చెబుతున్నాం: హీరో ఆనంద్ దేవరకొండ

“దొరసాని”, “మిడిల్ క్లాస్ మెలొడీస్” చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కొత్త సినిమా “పుష్పక విమానం” మొదటినుంచీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. గీత్ సైని, శాన్వీ మేఘన నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దామోదర దర్శకత్వంలో ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది “పుష్పక విమానం”. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఆనంద్ దేవరకొండ పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ విశేషాలు చూస్తే..

– దర్శకుడు దామోదర మా అన్నయ్య విజయ్ కు స్నేహితుడు. ఆయన చెప్పిన పుష్పక విమానం కథ బాగా మా అందరికీ నచ్చింది. వేరే హీరోలను ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నించాం. కుదరలేదు. పెళ్లాం లేచిపోయిన వ్యక్తి హీరో అవడం వాళ్లు సందేహించేలా చేసింది. మొదట్లో నాకు కూడా ఈ క్యారెక్టర్ చేయగలనా లేదా అనే డౌట్ వచ్చింది. టెస్ట్ షూట్ చేసిన తర్వాత నమ్మకం కుదిరి ఒప్పుకున్నాను.

– పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంటాడు టీచర్ గా పనిచేసే చిట్టిలంక సుందర్ అనే వ్యక్తి. కానీ పెళ్లయ్యాక అతని ఆశలన్నీ తలకిందులు అవుతాయి. భార్య లేచిపోతుంది. కానీ ఆ విషయం మీద పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వలేక తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో హీరోకు కోపం, ఫ్రస్టేషన్ వస్తుంటాయి. చూసే వాళ్లకు కూడా హీరో మీద జాలి కలుగుతుంది.

– పుష్పక విమానం ట్రైలర్ లో ఫన్ చూశారు. కానీ సినిమాలో ఫన్ ఫ్లస్ ఎమోషన్ రెండూ ఉంటాయి. నా క్యారెక్టర్ చాలా పద్దతిగా, సైలెంట్ గా ఉంటే హీరోయిన్ శాన్వి క్యారెక్టర్ చాలా బబ్లీగా, హుషారుగా ఉంటుంది. సునీల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయనది ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ, తన గురించి మాత్రమే ఆలోచించుకునే స్వభావం. ఈ క్యారెక్టర్ లో సునీల్ అన్న సూపర్బ్ గా నటించారు. నవ్విస్తారు, భయపెడతారు.

– పెళ్లి అనేది మన సమాజానికి దొరికిన ఒక సంప్రదాయం. పెళ్లి వల్ల మన లైఫ్ కు ఒక బాండింగ్, ఒక పర్పస్, ఒక సర్కిల్ ఏర్పడతాయి. పెళ్లి అనే విషయానికి నేను పూర్తి అనుకూలం. పుష్పక విమానం సినిమాలో పెళ్లి గురించి ఓ మంచి విషయాన్ని చెప్పబోతున్నాం.

– దర్శకుడు దామోదర పుష్పక విమానం చిత్రాన్ని చాలా క్లారిటీగా, ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాడు. నేను సినిమా పూర్తయ్యాక కొన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యా గానీ, సినిమా మేకింగ్ టైమ్ లో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అన్నయ్య విజయ్ కు పుష్పక విమానం సినిమా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేద్దామని ముందుకొచ్చాడు. తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నా, పుష్పక విమానం ప్రమోషన్ కు వీలైనంత టైమ్ ఇచ్చాడు.

– రెగ్యులర్ హీరోగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. దొరసాని సినిమా టైమ్ లో ఇలా ఉండాలని తెలీదు. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. అందులో కమర్షియల్ గా వెళ్లినా, లేక పూర్తిగా నేచురల్ గా వెళ్లినా ఫలితం మరోలా ఉండేది. కానీ మేము మధ్య దారిలో సినిమా చేయడం వల్ల దొరసాని అనుకున్నంత విజయం సాధించలేదు అనిపిస్తుంటుంది. మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా టైమ్ కు ఆ కథ ఎంత వర్కవుట్ అవుతుంది అనేది మాకు అంచనా లేదు. అంతా బొంబాయి చట్నీ కథ అనేవారు. కానీ ఆ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని మాకు నమ్మకం. అది వర్కవుట్ అయ్యింది.

– పాండమిక్ వల్ల పుష్పక విమానం సినిమా విడుదల ఆలస్యమైంది. మిడిల్ క్లాస్ మెలొడీస్ కూడా పాండమిక్ వల్ల డైరెక్ట్ ఓటీటీ కి వెళ్లింది. ఈ సినిమాకు అదే జరుగుతుందా అని భయపడ్డాం. కానీ థియేటర్ లోనే రిలీజ్ చేయాలని గట్టిగా అనుకున్నాం. కొంత ఆలస్యమైన పుష్పక విమానం సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్ అవుతుండటం సంతోషంగా ఉంది.

– మా సినిమా ప్రమోషన్ కు వచ్చిన అల్లు అర్జున్ అన్నకు థాంక్స్. ఆయన చాలా సపోర్ట్ చేసి టైమ్ ఇచ్చారు. ట్రైలర్ బాగుందని బన్నీ అన్న చెప్పడం వల్ల మా సినిమాకు మంచి బూస్టప్ వచ్చింది. ఆయన ఫ్యాన్స్ కూడా మాకు బాగా సపోర్ట్ గా ఉంటున్నారు.

– నా కథల ఎంపికలో అన్నయ్య ప్రమేయం ఉండదు. నేనే సెలెక్ట్ చేసుకుంటా. అన్నయ్య సినిమాల స్పాన్ చాలా పెద్దది. ఆయన లైగర్ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ టాలీవుడ్ అనుకోవచ్చు.

– నెక్ట్ కేవీ గుహన్ గారు, సాయి రాజేశ్ వంటి దర్శకులతో సినిమాలు చేయబోతున్నాను. వీటిలోనూ నా క్యారెక్టర్స్ సహజంగా మన చుట్టూ ఉండే అబ్బాయిలా ఉంటాయి. హీరో కొడతే పదిమంది ఎగరిపడాలనే ఇప్పటి ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు.

– పుష్పక విమానం లాంటి కొత్త తరహా కథల్లో నటించేందుకు నటీనటులు సిద్ధం అవుతున్నారు. అటు ఆఢియెన్స్ కూడా ఇలాంటి కొత్త కథలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి నా లాంటి ఆర్టిస్టులకు ఇన్నోవేటివ్ సబ్జెక్ట్స్ చేసేందుకు స్కోప్ దొరుకుతోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Geeth Saini
  • #Pushpaka Vimanam
  • #Saanve Megghana

Also Read

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

related news

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

trending news

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

6 hours ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

9 hours ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

12 hours ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

13 hours ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

14 hours ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

3 days ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

3 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version