Anand Deverakonda: ‘బేబీ’పై కామెంట్స్‌… హీరో సీరియస్‌… అంతగా ఏమన్నారని చిన్న దేవరకొండ?

చూడకుండా ఓ సినిమాను కామెంట్‌ చేస్తే ఆ సినిమా టీమ్‌కి చాలా కోపం వచ్చేస్తుంది. అయితే కొందరు కూల్‌గా సమాధానం ఇస్తే.. ఇంకొందరు హార్స్‌ అయిపోతుంటారు. అయితే సినిమాను కాకుండా సినిమా కాన్సెప్ట్‌ను కామెంట్‌ చేస్తే ఆ టీమ్‌ రియాక్ట్‌ అయితే.. రిస్క్‌లో పడ్డట్టే. ఎందుకంటే ఈ ట్రోలింగ్‌ యుగంలో ఎప్పుడో చేసిన కామెంట్లను ఇప్పుడు బయటకు తీస్తున్నారు. మరి ఆనంద్‌ దేవరకొండ ఇప్పుడు నెటిజన్లను ఓ మాట అనేశారు. దీంతో తర్వాత ఏమవుతుంది అనే చర్చ మొదలైంది. అంతగా ఆయనేమన్నారు, అంతకుముందు నెటిజన్‌ ఏమన్నారో మీరే చదవండి.

(Anand Deverakonda) ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జులై 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఈ క్రమంలో సినిమాలోని హీరోయిన్‌ లుక్స్‌ను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ విమర్శలు చేశాడు. యూట్యూబ్‌ షార్ట్‌ను ఫీచర్‌ ఫిల్మ్‌గా చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ టీమ్‌కు ఇబ్బందికరంగా కామెంట్స్‌ పెట్టాడు.

కాన్సెప్ట్‌, యాడ్స్‌ విషయంలో తీవ్ర విమర్శలు రాడంతో ఫెయిర్‌ అండ్‌ లవ్లీ తన పేరును గ్లో అండ్‌ లవ్లీగా మార్చుకుంది అంటూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ సినిమా కాన్సెప్ట్‌ను కించపరిచే ప్రయత్నం చేశాడు. 2023లో నలుపు, తెలుపు అంటూ శరీర రంగును ఉద్దేశించేలా తెరకెక్కిన సినిమా ‘బేబీ’. ఇలాంటి సినిమాలను మనం ఇంకా చూస్తున్నాం. ఒక యూట్యూబ్‌ షార్ట్‌ను పూర్తిగా స్థాయి చిత్రంగా మారిస్తే ఇలాగే ఉంటుంది అంటూ విమర్శ చేశాడు.

ఈ కామెంట్స్‌ అటు తిరిగి ఇటు తిరిగి ఆనంద్‌ దేవరకొండ దగ్గరకు వచ్చాయి. దీంతో ఆయన ఆ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఇప్పుడు ఈ విషయంపై వివాదం చేయడం అనవసరం అనుకుంటున్నా. సినిమా చూసిన తర్వాత కామెంట్‌ చేసి ఉంటే బాగుండేది’’ అని ఆనంద్ అన్నాడు. దీంతో ఇప్పుడు ఆనంద్‌పై కూడా కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. శరీర రంగు కాన్సెప్ట్‌ను ఉద్దేశించి నెటిజన్‌ అన్నాడు.. ఇంత సీరియస్‌ అయ్యావు. సినిమా వచ్చాక ఏదైనా తేడా కొడితేనో అని మరికొందరు అంటున్నారు. ఇటీవల మిడిల్‌ ఫింగర్‌పై హీరోయిన్‌ను నిలబెట్టి పోస్టర్స్‌ తీసుకొచ్చిన టీమ్‌ ‘బేబీ’నే అని గుర్తుంచుకోవాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus