Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ లైనప్ బాగుంది!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ‘దొరసాని’ (Dorasani) తో డెబ్యూ ఇచ్చాడు. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే ఆ సినిమా విషయంలో హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar) ఎక్కువ మార్కులు కొట్టేసింది అని చెప్పాలి. తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ (Middle Class Melodies)  చేశాడు. అది ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.ఆ తర్వాత చేసిన ‘పుష్పక విమానం’ (Pushpaka Vimanam) ‘హైవే’ (Highway) ‘గం గం గణేశ’ (Gam Gam Ganesha) ఆడలేదు. అయితే ‘బేబీ’ (Baby) సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Anand Deverakonda

దీంతో ఆనంద్ కి (Anand Deverakonda) కొంత మార్కెట్ ఏర్పడింది. దాన్ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు కూడా ప్రయత్నిస్తున్నారు.ఈ లిస్టులో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నాగవంశీ (Suryadevara Naga Vamsi) ముందు వరసలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ బ్యానర్లో ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. అయితే ’90’s’ (90’s – A Middle-Class Biopic) దర్శకుడు ఆదిత్యతో సినిమా అనౌన్స్ చేశారు. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఇందులో హీరోయిన్ గా నటించాల్సి ఉంది. ’90’s’ కి ఇది సీక్వెల్ కాకపోతే…ఈసారి సినిమాగా తీస్తున్నారు.

ఆల్రెడీ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఈ సినిమా వెంటనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదట. దీంతో ముందుగా ఆనంద్ తో మరో సినిమా నిర్మిస్తున్నాడు నాగవంశీ. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో ఆనంద్ కి గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన దర్శకుడు వినోద్ అనంతోజ్.. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడట. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ అప్పుడే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయినట్టు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus