Anand Deverakonda: సూపర్ స్టార్ మహేష్ లా ఎవరూ చేయలేరు.. విజయ్ తమ్ముడు ఏమన్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu)  సినీ కెరీర్ లో పోకిరి (Pokiri) సినిమా ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించింది. మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ సినీ అభిమానులను సైతం ఈ సినిమా ఎంతగానో మెప్పించింది. పోకిరి సినిమా విడుదలై 18 సంవత్సరాలు కాగా ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పోకిరి మూవీలో మహేష్ బాబు పరుగెత్తే స్టిల్ ను ఆనంద్ దేవరకొండ షేర్ చేయడంతో పాటు నేను స్కూల్ లో చదువుకునే సమయంలో స్కూల్ కారిడార్ లలో చాలామంది పిల్లల్లా నేను కూడా ఈ రన్నింగ్ స్టైల్ ను ప్రయత్నించడం నాకు గుర్తుందని ఆనంద్ దేవరకొండ అన్నారు. కళ్లలో కోపం, పెద్ద పెద్ద అడుగులు వేసే కాళ్లు, షార్ప్ చేతులు ఇలా మహేష్ బాబు స్టైల్ ఐకానిక్ స్టైల్ అని ఆయన తెలిపారు.

మహేష్ బాబులా ఎవరికీ రాదని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు. పోకిరి మూవీ మాస్టర్ పీస్ అని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు. దిల్ సుఖ్ నగర్ లో కోణార్క్ థియేటర్ లో ఈ సినిమా క్రేజ్ గుర్తుకొస్తోందని ఆయన తెలిపారు. ఆనంద్ దేవరకొండకు మహేష్ అంటే ఇంత అభిమానమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆనంద్ పోస్ట్ గురించి మహేష్ బాబు రియాక్ట్ అవుతారేమో చూడాలి.

మహేష్ కెరీర్ విషయానికి వస్తే రాజమౌళి (S. S. Rajamouli) సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి రెమ్యునరేషన్, మహేష్ బాబు రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉండగా ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో రూల్స్ లేవనే సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబో మూవీ టైటిల్, రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు. ఈ ప్రకటనల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus