EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య..లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ‘బేబీ’ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. అటు తర్వాత వీరి కాంబినేషన్లో మరో సినిమా అనౌన్స్ అయ్యింది. కానీ ఊహించని విధంగా అది ఆగిపోయింది. అయితే ప్రస్తుతం వీరి కాంబినేషన్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతుంది. ఓటీటీలో సూపర్ హిట్ అయిన 90’S వెబ్ సిరీస్..కి సీక్వెల్ గా ఓ సినిమా రూపొందుతోంది.’సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు.

EPIC – First Semester Review

‘సితార..’ బ్యానర్లో రూపొందుతున్న 32వ సినిమా ఇది.దీనికి ‘ఎపిక్ -ఫస్ట్ సెమిస్టర్’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ.. సినిమా కాన్సెప్ట్ ను కూడా రివీల్ చేశారు. 2 నిమిషాల 27 సెకన్లు నిడివి కలిగిన ‘ఎపిక్’ గ్లింప్స్ లో విదేశాల్లో ఉండే హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తన స్నేహితులతో చెబుతూ ఉంటుంది.

ఆ వెంటనే గాయకుడు గద్దర్ ను గుర్తు చేసే అవతారంలో హీరో ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఇది’ అంటూ దర్శకుడు ఆదిత్య హాసన్ మార్క్ డైలాగ్ తో గ్లింప్స్ ముగిసింది. మొత్తంగా ఇది చాలా ఎంగేజింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

 

సమంత రెండో పెళ్లి పై హీరోయిన్ సెటైర్లు.. ‘ నీ ఇంటి కోసం..వాళ్ళ ఇంటిని పడగొట్టి’ అంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus