‘పిచ్చిగా వదరితే చెప్పుతో కొడతా’ అంటూ పబ్లిక్ లోనే ఒక ఆకతాయికి మాస్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళింది అనసూయ. ఆమెకు సోషల్ మీడియాలో, స్మాల్ స్క్రీన్లో సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
బాగా పాపులర్ కాబట్టి…. చాలా క్రౌడ్ వచ్చింది. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయి మూక అనసూయని ‘ఆంటీ’ అని రకరకాలుగా ఆమెకు కోపం వచ్చేలా అరుస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో అనసూయకి కోపం వచ్చింది. ‘చెప్పు తెగుద్ది…! మీ ఇంట్లో ఆడాళ్ళని ఇలా అంటే ఊరుకుంటారా’ అంటూ వెంటనే మాస్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ మధ్య అనసూయ ఎక్కడా తగ్గడం లేదు. ఒకప్పటిలా ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఎక్కడికక్కడ తనను ఇబ్బంది పెట్టే వారికి ఇచ్చి పడేస్తుంది. మొన్నటికి మొన్న 30 లక్షల మందిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్టు అనసూయ తెలిపిన సంగతి తెలిసిందే.
కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్ గా పనిచేసిన అనసూయ.. అటు తర్వాత ‘నాగ’ వంటి పలు సినిమాల్లో కూడా నటించింది. అయితే ‘జబర్దస్త్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. అటు తర్వాత ‘రంగస్థలం’ ‘క్షణం’ ‘పుష్ప’ వంటి సినిమాలతో టాప్ ప్లేస్ కు చేరుకుంది అనసూయ. సోషల్ మీడియాలో కూడా ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.