విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సినిమాకి మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తీసుకుంది. ఈ వీకెండ్ వరకు ‘కింగ్డమ్’ ఓపెనింగ్స్ కు డోకా లేనట్టే అని చెప్పాలి. ఈ క్రమంలో సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు విజయ్ దేవరకొండ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ” వాస్తవానికి ‘కింగ్డమ్ 2’ కాదు ‘కింగ్డమ్ 3’ లో అసలైన కథ ఉంటుంది. ప్రోపర్ 1920లలో రూపొందే కథ. వాస్తవానికి ‘కింగ్డమ్’ కి ముందుగా ‘దేవర నాయక’ అనే టైటిల్ అనుకున్నాం. కానీ తారక్ అన్న ‘దేవర’ కోసం ఆ టైటిల్ వదులుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
‘కింగ్డమ్’ సినిమా కథని 2 భాగాలుగా తీస్తున్నట్టు నిర్మాత నాగవంశీ అండ్ టీం ముందుగానే రివీల్ చేసింది. కానీ ‘కింగ్డమ్’ మొదటి రోజు సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. 2వ పార్ట్ కోసం మొదటి భాగాన్ని సాగదీశారు, మొదటి భాగంలోనే కథ కంప్లీట్ గా చెప్పే అవకాశం ఉన్నా… ఇంకంప్లీట్ గా ఆడియన్స్ ను థియేటర్ నుండి బయటకు పంపారు అనే కంప్లైంట్ ఆడియన్స్ లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్ 3’ లో అసలు కథ అనడంతో మిక్స్డ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. మరోపక్క ‘కింగ్డమ్’ కి ‘దేవర నాయక’ అనే టైటిల్ అనుకున్నట్టు కూడా తెలుపడం షాకిచ్చే అంశం.విచిత్రంగా ‘దేవర’ విషయంలో కూడా ‘కింగ్డమ్’ కి వచ్చిన టాకే వచ్చింది అని చెప్పాలి.