Anasuya: ఇది అనసూయ ప్రేమ కహాని.. పెళ్ళికి కోసం 9 ఏళ్ళు కష్టపడిందట..!

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. బుల్లితెర పై కానీ,సోషల్ మీడియాలో కానీ.. ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమె గ్లామర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కుర్రకారుని అట్రాక్ట్ చెయ్యడంలో కూడా ఈమె టాప్ లో ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అంటే అది ఓ అందమైన అబద్దమే అని కుర్రకారు ఈమెను ప్రశంసిస్తూ ఉంటారు.ఇక బిగ్ స్క్రీన్ పై కూడా మంచి ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ అలరిస్తూ ఉంటుంది అనసూయ.

‘క్షణం’ ‘రంగస్థలం’ ‘యాత్ర’ వంటి సినిమాల్లో మంచి నటన కనపరిచి తన ప్రత్యేకతను చాటుకుంది.ఈమె నటించిన లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ బ్రదర్’ మూవీ మే 7న ‘ఆహా’ ఓటిటి వేదికగా విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్న అనసూయ తన పర్సనల్ లైఫ్ గురించి ముఖ్యంగా ఆమె లవ్ స్టోరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. తన భర్త సుశాంక్ భరద్వాజ్ ను ‘సాక్షి’ ఛానల్ లో మొదటిసారి కలుసుకున్నట్టు ఇటీవల చెప్పుకొచ్చిన అనసూయ..

అతనితో డేటింగ్ చేసినట్టు కూడా తెలిపి షాక్ ఇచ్చింది. ఇక మొదటి సారి తన భర్తే ప్రపోజ్ చేసాడని.. కానీ ఓకే చెప్పడానికి ఆమె ఏడాదిన్నర వరకూ సమయం తీసుకున్నట్టు తాజాగా తెలిపింది. ‘ఎందుకు అంత టైం తీసుకున్నారు?’ అని యాంకర్ ప్రశ్నించగా.. ‘నమ్మడం కష్టం అయ్యింది.. ఒకసారి నమ్మిన తరువాత వదల్లేకపోయాను. అతన్ని పెళ్లి చేసుకోవడానికి 9 ఏళ్ళు కష్టపడ్డాను’ అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.


1

2

3

4

5

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus