జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎప్పుడు ఏం చేస్తుందో? ఏం మాట్లాడుతుందో? ఒక్కోసారి ఎవ్వరికీ అర్ధం కావు. ఆమె మాట్లాడిన మాటలకి.. చేసిన చేష్టలకి.. అర్ధం చెప్పేలా ఇంకో పోస్ట్ లేదా వీడియో పోస్ట్ చేస్తుంటుంది. ఆ టైంలో నేను అలా అన్నాను.. కానీ అందరూ ఇలా అనుకున్నారు? అంటూ ఏంటేంటో చెబుతూ ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. తాజాగా అనసూయ భోరున ఏడుస్తూ ఓ వీడియోని, ఓ పోస్ట్ ను పెట్టింది. అందులో ఏంటేంటో రాసుకొచ్చింది. ఒక్కటి కూడా నేరుగా అర్ధం వచ్చేలా లేదు అని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేశారు. కానీ అనసూయకి ట్రోలింగ్ కొత్త కాదు. కానీ ఆమె ఎవరి కామెంట్లకైనా డీప్ గా హర్ట్ అయ్యిందేమో అని కొందరు అనుకున్నారు.
అయితే మళ్ళీ ఏమైందో ఏమో కాసేపటికి నవ్వుతూ ఇంకో వీడియో పోస్ట్ చేసింది. ఆమె నవ్వుతూ చేసిన వీడియో ద్వారా ఏడుస్తూ చేసిన వీడియోకి అర్ధం చెప్పింది. ” నేను ఏడ్చిన తరువాత పార్లర్‌కి వెళ్లాను.. మంచిగా రెడీ అయ్యాను.. ఎందుకంటే మళ్లీ నాకు షూట్ ఉంది. అయితే నేను ఎందుకు ఏడ్చాను? అనేది కూడా చెప్పాను. కొంతమందికి అర్ధమైంది.. ఇంకొంతమందికి అర్ధం కాలేదు. నేను ట్రోలింగ్‌కు భయపడి ఏడ్చాను అని అంతా అనుకుంటున్నారు. నేను అందుకు ఏడ్వలేదు. ట్రోలింగ్‌కు భయపడను.. భయపడి అలా ఏడవను.
పర్సనల్ లైఫ్‌లో తీసుకున్న ఓ నిర్ణయం వల్ల బాధపడ్డాను. ఏడ్చాను! ఆ మూమెంట్‌ను మరిచిపోవద్దని అలా రికార్డ్ చేసుకున్నాను. మీరు చదవలేదా? ఒక వేళ నేను అక్కడ సరిగ్గా చెప్పలేదనుకుంటే.. కొంత మందికి కూడా అర్థం కాకూడదు.. మాకు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా హ్యాపీగానే కనిపించాలి.. నేను పబ్లిక్ ఫిగర్‌ని కదా? ఎప్పుడూ సంతోషంగానే కనిపించాలి కదా?.. అనే విషయాన్ని చెప్పాను.. ట్రోలింగ్ వల్ల బాధపడలేదు.. బ్రేక్ డౌన్ అవ్వలేదు” అంటూ ఏంటేంటో చెప్పుకొచ్చింది అనసూయ.