ఆయనతో పెళ్లి కోసం 9ఏళ్ళు ఎదురుచూసిన అనసూయ

అనసూయ అంటే ప్రస్తుతం తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా నటిగా ఆమె కెరీర్ లో దూసుకుపోతుంది. ఎం బి ఏ పూర్తి చేసిన అనసూయ హెచ్ ఆర్ ఉద్యోగినిగా, టీవీ న్యూస్ ప్రెజెంటర్ గా అనేక రంగాలలో కొనసాగారు. ఐతే ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ఆమె కెరీర్ ని మలుపుతిప్పింది. కాగా అనసూయ ప్రేమ, పెళ్లిలో సినిమాకు మించిన నాటకీయత, మలుపులు ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ హాట్ యాంకర్ ఓ సందర్భంలో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు.

అనసూయ లవ్ స్టోరీ ఇంటర్మీడియట్ లోనే మొదలైందట. ఓ ఎన్ సి సి క్యాంపులో భరద్వాజ్ తనకు పరిచయం అయ్యాడట. మొదటి పరిచయంలోనే నువ్వంటే ఇష్టం.. నీకు కూడా ఇష్టం అయితే పెళ్లి చేసుకుంటాను అన్నాడట. టీనేజ్ కూడా దాటని ప్రాయంలో పెళ్లేంటని అనసూయకు ఒకింత ఆశ్చర్యం కలిగినా అతని ధైర్యం ఆమెకి నచ్చిందట. ఐతే ఆ సంఘటన జరిగిన ఏడాదిన్నరకు మరలా అలాగే ఓ ఎన్ సి సి క్యాంపులో వీరిద్దరూ కలవడం, స్నేహం, ప్రేమ జరిగిపోయాయట.

ఐతే అనసూయ ప్రేమని ఆమె తండ్రి అస్సలు అంగీకరించలేదట. తనతో పాటు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్న నేపథ్యంలో భరద్వాజ్ తో పెళ్ళికి ఆయన ససేమిరా అన్నారట. భరద్వాజ్ కోసం ఇంటి నుండి వెళ్ళిపోయి అనసూయ కొన్నాళ్ళు బయట హాస్టల్ లో ఉందట. తండ్రి అంగీకారం కోసం విసిగిపోయి లేచి పోయి పెళ్లి చేసుకుందాం అని అడిగినా భరద్వాజ్ పెద్దల అంగీకారం అవసరం అని ఆమెకు నచ్చజెప్పేవాడట. ఎట్టకేలకు 2010లో ఫిబ్రవరి 10న 9 ఏళ్ల తరువాత పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus