బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై కూడా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఇలా వెండితెర సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ కావడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమై కేవలం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా అనసూయ నటించిన పెద్ద కాపు సినిమా సెప్టెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా అనసూయ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అనసూయ తన ప్రేమ పెళ్లి గురించి పలు విషయాలను వెల్లడించారు. తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి అందరికీ తెలిసిందే.వీరిద్దరిని ప్రేమ వివాహమని ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు అనే విషయం మనకు తెలిసిందే.
అనసూయకు (Anasuya) ఏమాత్రం షూటింగ్ సమయంలో విరామం దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంతో సందడి చేస్తూ ఉంటారు. శశాంక్ బీహార్ కి చెందిన అబ్బాయని తెలిపారు. తనతో దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేమలో ఉండడమే కాకుండా ఇద్దరం సహజీవనం కూడా చేశామని తెలియజేశారు. ఇక తనతో సహజీవనం చేస్తున్నప్పుడూ కూడా మీ కులం ఏంటి అని నేను అడగలేదని తాను కులానికి ప్రియారిటి ఇవ్వనని అనసూయ తెలిపారు.
ఇలా ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేసిన తరువాత తన తండ్రితో పోట్లాడి శశాంక్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకున్నానని అయితే పెళ్లి పత్రికలో తన కులం ఏంటి అనే విషయం నాకు తెలిసిందని ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు. ఇక సినిమాలు టీవీ షోస్ గురించి కూడా ఈమె మాట్లాడుతూ తాను టీవీ షోస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానని త్వరలోనే ఈ టీవీ షో ద్వారా తాను ప్రేక్షకుల ముందు రాబోతున్నాను అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.