ప్రముఖ టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన అనసూయకు అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ కు అనసూయ దూరమైన తర్వాత వేర్వేరు అంశాల గురించి స్పందించడం ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అనసూయ నా ట్వీట్లను రాజకీయం చేయొద్దంటూ కామెంట్లు చేయడం గమనార్హం. తన పర్సనల్ ఒపీనియన్స్ కు రాజకీయ రంగు పులమొద్దని ఆమె అన్నారు. ట్విట్టర్ లో నేను ఏం పోస్ట్ చేసినా ఇష్టపూర్వకంగా అభిరుచి మేరకు పోస్ట్ చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
తాను ఒక వ్యక్తి, సంస్థ సిద్ధాంతాలను ప్రమోట్ చేయడానికి, డబ్బుల కొరకు ట్వీట్లు చేయడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఏదైనా విషయం గురించి పూర్తి సమాచారం ఉన్న సమయంలో మాత్రమే నేను పెదవి విప్పుతానని ఆమె కామెంట్లు చేశారు. ఏదైనా అంశం గురించి ఫ్యాన్స్ మాట్లాడాలని కోరినా అవగాహన లేకపోతే దాని గురించి నేను మాట్లాడటం లేదని ఆమె తెలిపారు. ఒకవేళ నేను ఆ విషయాల గురించి మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
అందువల్ల నేను నా సొంత నిర్ణయానికి రాలేకపోతున్నానని ఆమె వెల్లడించారు. అందువల్ల దయచేసి నా ట్వీట్లపై రాజకీయం చేయవద్దని ఆమె కోరారు. అనసూయ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు అనసూయ ఇలా రియాక్ట్ కావడానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక కేసుకు సంబంధించి తాజాగా అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వివాదాస్పదం అయ్యాయి.
కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేశారు. ఈ కారణం వల్లే అనసూయ ఈ విధంగా స్పందించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అనసూయ ఒకవైపు బుల్లితెర షోలు చేస్తూనే ఈవెంట్ల ద్వారా కూడా బిజీ అవుతున్నారు. అనసూయ కెరీర్ విషయంలో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.