భాషతో సంబంధం లేకుండా అన్ని సినీ పరిశ్రమల్లోనూ మహిళలు లైంగిక వేధింపుల గురించి గళమెత్తుతున్నారు. గతంలో హాలీవుడ్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా `మీటూ` ఉద్యమం మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా కారణంగా బాలీవుడ్‌లో కూడా ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ నటీమణులు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడారు.
టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు, సింగర్స్‌తోపాటు మహిళా జర్నలిస్టులు కూడా `మీటూ`పై స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ యాంకర్ అనసూయ కూడా `మీటూ`పై స్పందించింది. `పనిచేసే చోట మహిళలకు ఎదురవుతున్న లైంగిక వేధింపులు అత్యంత దురదృష్టకరం. అయితే ఈ వేధింపులు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాలేదు. వేధింపుల బాధితుల్లో చిన్న పిల్లలు, మగవాళ్లు కూడా ఉన్నారు. ఈ వేధింపులకు వ్యతిరేకంగా అందరూ ధైర్యంగా పోరాడాలి. నాకు తెలిసినంతవరకు టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు తక్కువేన`ని అనసూయ చెప్పింది.