అనసూయ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే ఈమె చాలా కామన్ గా చెప్పే విషయాలు కూడా కొన్నిసార్లు వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.
ఇలా అనసూయ తరచు వివాదాలను ఎదుర్కొంటూ నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే అనసూయ సుధీర్ ఇద్దరు కలిసి సూపర్ సింగర్ జూనియర్ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించారు. అదేవిధంగా వీరిద్దరూ వాంటెడ్ పండు గాడ్ సినిమాలో నటించి సందడి చేశారు. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ అనసూయని ప్రశ్నిస్తూ సుడిగాలి సుధీర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించిందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ సుదీర్ నాకు జూనియర్ అని మీకు తెలియదా..
ఈ ప్రశ్న తనని అడగాలి అంటూ కాస్త ర్యాష్ గా సమాధానం చెప్పారు.సుధీర్ నా నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. నేను కూడా తన నుంచి ఎన్నో నేర్చుకున్నాను అంటూ అనసూయ తానే గొప్ప అన్నట్టు చెప్పడంతో సుధీర్ ఫాన్స్ కు బాగా మండింది. దీంతో ఈమెను మరోసారి భారీగా ట్రోల్ చేస్తున్నారు. అనసూయ రెండు సినిమాలు హిట్ అవ్వగానే ఎందుకు ఇంత ఆటిట్యూడ్ చూపిస్తున్నావు?
ఇంత అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం అందుకే కదా నిన్ను ఆంటీ అనేది అంటూ మరోసారి ఆంటీ వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.మొత్తానికి అనసూయ ఈ విషయాన్ని చాలా కామన్ గా చెప్పినప్పటికీ సుదీర్ ఫ్యాన్స్ మాత్రం అనసూయను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.