Anasuya: మునుపెన్నడూ చూడనంత హాట్ గా అనసూయ ఐటెం సాంగ్ ఉంటుందట..!

టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్స్ గా చలామణి అవుతున్న రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉంటుంది. ఇది కొంతమంది నుండి కంప్లైంట్ గా కూడా మారింది అని చెప్పొచ్చు. అదేంటి అంటే.. రిపీటెడ్ క్యాస్టింగ్. అచ్చొచ్చిన కాంబినేషన్ నే నెక్స్ట్ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తుంటారు. రాజమౌళి సినిమాలకు కీరవాణి ఎలా కామనో, సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ అలా కామన్. త్రివిక్రమ్ గురించి చెప్పాల్సిన పని లేదు.

చాలా వరకు సేమ్ క్యాస్టింగ్ ఉంటుంది. హీరోయిన్ ను మూడు, నాలుగు సినిమాలకు కంటిన్యూ చేస్తాడు. సరే ఇప్పుడు మేటర్ సుకుమార్ గురించి. ‘రంగస్థలం’ సూపర్ హిట్ అవ్వడంతో అందులో క్యాస్టింగ్ నే ‘పుష్ప’ లో కూడా కంటిన్యూ చేశాడు. అందులో అనసూయ ఒకరు. ‘పుష్ప ది రైజ్’ లో ఆమె విలన్ మంగళం శ్రీను భార్య దాక్షాయణి గా కనిపించింది.క్లైమాక్స్ లో మంగళం శ్రీనుని బ్లేడ్ తో పీక కోసే సీన్ లో చాలా క్రూరంగా కనిపించింది అనసూయ.

అయితే సెకండ్ పార్ట్ లో కూడా మంగళం శ్రీను బ్రతికే ఉంటాడు. తన తమ్ముడు మొగిలీసుని చంపినందుకు గాను అనసూయ కూడా పుష్ప పై పగ తీర్చుకోవడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలో పుష్ప ను ఆమె ఫాలో అయ్యే క్రమంలో.. ఓ ఐటెం సాంగ్ లో కూడా నర్తిస్తుంది అని వినికిడి. ఈ సాంగ్ లో ఆమె మునుపెన్నడూ కనబడనంత గ్లామర్ గా కనిపించబోతుందని తెలుస్తుంది. అల్లు స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ ఐటెం సాంగ్ ను చిత్రీకరించే అవకాశాలు ఉన్నట్లు భోగట్టా.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus