Anasuya: పేర్లు వాడినంత సులభం కాదు ఈ స్థాయికి రావడం!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అనసూయ ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా అనసూయ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు తనకు సంబంధించిన అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన పట్ల ఎవరైనా నెగటివ్ కామెంట్ చేస్తే వారికి తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ ఉంటారు.

తాజాగా ఒక నెటిజన్ అనసూయను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది అయితే ఇలా తన ప్రమేయం లేకుండా తన పేరును ఉపయోగించి తన పట్ల కామెంట్ చేయడంతో అనసూయ కూడా స్పందిస్తూ వారికి తన స్టైల్ లోనే సమాధానం చెప్పింది. ఆదివారం కృష్ణా జిల్లాలోని పోరంకిలో దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధా వివాహం జరిగింది. ఇలా వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

అయితే పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆయనని చూడటానికి ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగపడ్డారు. దీంతో కాస్త తోపులాట జరిగింది. ఇలా సెక్యూరిటీ వారందరిని తోసేసి పవన్ ఆయన్ను సురక్షితంగా తీసుకెళ్లారు. తోపులాటలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని సైతం ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఈ వీడియో పై ఒక నెటిజన్ స్పందిస్తూ..

(Anasuya) అనసూయ, రష్మి వచ్చినా జనాలు ఇలానే ఎగబడతారని కామెంట్ చేశాడు. దీనిపై అనసూయ స్పందిస్తూ ఇలా అగౌరవంగా మా పేరు లాగటం తప్పండీ. జీవితంలో ఏదైనా సాధించినవాళ్లని చూసేందుకు జనం ఇలానే ఎగబడతారు. మీరు మా పేర్లు వాడినంత తేలికైతే కాదు.. ఇంతటి స్థాయికి రావడం. మా జర్నీని గౌరవించండని అని తన స్టైల్ లో రిప్లై ఇచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus