ఇతను వైరస్ కన్నా ప్రమాదకరం : అనసూయ

బుల్లితెర పై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ … సోషల్ మీడియాలో కూడా స్టార్ గానే దూసుకుపోతుంది. మరోవైపు సినిమాల్లో కూడా మంచి పాత్రలు ఎంచుకుంటూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటుంది. బుల్లితెర పై గ్లామర్ షో చేస్తుంది కదా సినిమాల్లో అలాంటి గ్లామర్ షో చెయ్యదు. ఎటువంటి వల్గారిటీ లేని పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇదిలా ఉంటే.. వివాదాలతో కూడా వార్తల్లో నిలవడంలో అనసూయ ముందే ఉంటుంది. ఎప్పటినుండో మనం చూస్తూనే ఉన్నాం. ఇక నెటిజన్ల తో ఏదో ఒక విధంగా ఫైర్ అవుతూ ఉండడం కూడా మనం చూస్తున్నాం.

ఇప్పుడు ఓ టిక్ టాక్ స్టార్ పై అనసూయ ఫైర్ అయ్యింది. ఇతనికి టిక్ టాక్ లో 11.8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను ఓ వీడియో పెడితే క్షణాల్లో వేలల్లో లైక్ లు వస్తాయి. తాజాగా ఇతను ఓ వీడియో పెట్టాడు. ఆ వీడియోలో .. ఆ యువకుడు అమ్మాయికి డాష్ ఇస్తాడు. దీనికి ఆ అమ్మాయి కోపంగా మోహం పెడుతుంది. దానికి ఆ అబ్బాయి తన చేతి పై ఉమ్ము వేసి … తరువాత ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి సారీ చెప్తూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. అటు తరువాత ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు హీరోలా బిల్డప్ ఇస్తూ వెళతాడు.

అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెట్టుకున్నాడు. ఈ వీడియో పై చాలా మంది ఫైర్ అవుతున్నారు. అనసూయ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.’ఇలాంటి వాళ్ళను తిట్టాలో.. లేక ఇలాంటి వాళ్ళను ఫాలో అవుతున్న వాళ్ళను తిట్టాలో నాకు అర్థం కావడం లేదు. వైరస్ కంటే కూడా ప్రమాదకారి ఇతను.ఇలాంటి వాళ్ళను జైలులో పెట్టాలి. ఇతని ఎకౌంటు ను తక్షణమే తొలగించాలి అని ‘టిక్ టాక్’ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అంటూ అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది.

Most Recommended Video


అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus