యాంకర్ అనసూయ తరచూ ట్రోలింగ్ కి గురవుతుంటుంది. ఆమె ఏ పోస్ట్ చేసినా.. ఎలాంటి ఫొటోలు షేర్.. ఏమైనా కామెంట్స్ చేసినా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఆమెపై చేసే నెగెటివ్ కామెంట్స్ పై కూడా అనసూయ రియాక్ట్ అవుతుంటుంది. నెటిజన్లకు తన స్టైల్ లో కౌంటర్లు వేస్తుంటుంది. మొన్నామధ్య కోటా శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ పై అనసూయ మండిపడిన సంగతి తెలిసిందే. కోటా లాంటి సీనియర్ నటులనే ఆమె విడిచిపెట్టలేదంటే..
ఇక సామాన్యులనే మాటలను పడుతుందా..? ఆ మధ్య అలీతో సరదాగా షోలో అనసూయ గెస్ట్ గా వచ్చినప్పుడు అసలు విషయం చెప్పింది. నెగెటివ్ కామెంట్ చేసిన ప్రతీ ఒక్కడి చిట్టా తన వద్ద ఉందని.. అందరి సంగతి చెబుతానంటూ ట్రోలర్స్ పై విరుచుకుపడింది. కెరీర్ ఆరంభంలో ఈ ట్రోలింగ్ వలన తాను.. తన కుటుంబం ఎన్ని కష్టాలని చవి చూసిందో.. ఎంతగా డిప్రెషన్ లోకి వెళ్లిందో చెప్పుకొచ్చింది అనసూయ. అయితే తాజాగా తన అభిమానులతో ముచ్చటించింది అనసూయ.
ఇందులో ఓ నెటిజన్.. నెగెటివ్ ట్రోలింగ్ ని ఎలా ఎదుర్కొంటున్నారని ప్రశ్నించాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. ట్రోలింగ్ ను పట్టించుకోవద్దనే విషయాన్ని నేర్చుకున్నానని.. కెరీర్ ఆరంభంలో తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినప్పటికీ.. మేం మరింత స్ట్రాంగ్ అయ్యామని చెప్పుకొచ్చింది. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని.. అది కచ్చితంగా అందరికీ న్యాయం చేస్తుందని తెలిపింది. ఒకరిని నువ్ తిడితే.. ఇంకొకరు నిన్ను తిడతారు.. నువ్ ఒకడిని బాధ పెడితే.. నిన్ను ఒకరు బాధపెడతారు అంటూ ఫిలాసఫీ చెప్పింది.