Jhansi: 2023 కన్నీటిని మిగిల్చింది.. ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గాను నటిగాను ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి వారిలో ఝాన్సీ ఒకరు ఈమె బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం వెండితెరపై నటిగా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి కీలక పాత్రలలో నటిస్తూ వెండితెరపై ఈమె ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో కూడా కీలక పాత్రలో ఝాన్సీ సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఝాన్సీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ఏడాది మరి కొద్ది రోజులలో పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా ఈమె ఈ ఏడాది తనకు కన్నీళ్లను మిగిల్చింది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ఏడాదిలో తనకు ఎంతో ఆప్తులు అయినటువంటి ముగ్గురు తన నుంచి దూరమయ్యారని చనిపోయిన వారిని తలచుకొని ఈమె ఎమోషనల్ అయ్యారు.

తన తండ్రి ఈ ఏడాది మరణించారు.డాడీ, బడ్డీ, శ్రీను వెళ్లిపోయారు.. 2023 కన్నీటిని మిగిల్చింది.. ప్రేయర్స్ అంటూ వారి ముగ్గురి ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఈ ఏడాదిలో తన తండ్రితో పాటు వీరు ఎంతగానో ప్రేమగా పెంచుకున్నటువంటి వీరి పెంపుడు కుక్క బడ్డీ, అలాగే తన పిఏ శీను చనిపోయారు. ఇక వీరు చనిపోయినప్పుడు ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

అయితే తాజాగా మరోసారి ఈ ముగ్గురిని తలుచుకుంటూ ఈ ఏడాది తనకు కన్నీళ్లను మిగిల్చింది అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక (Jhansi) ఈమె పోస్టు పై పలువురు నెటిజెన్స్ స్పందిస్తూ స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus