యాంకర్ ప్రదీప్ లిప్ లాక్ వైరల్..అస్సలు తగ్గడం లేదుగా..!

సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ ‘రెడ్’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక శర్మ తో పాటు నివేదా పేతురాజ్, అమృత అయ్యర్ వంటి హీరోయిన్లు కూడా నటించారు. ముఖ్యంగా గాయిత్రి పాత్ర పోషించిన అమృత అయ్యర్.. నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘సినిమాలో ఈమె పాత్ర ఇంకాసేపు ఉంటే బాగుణ్ణే’.. అని ప్రేక్షకుల నుండీ కామెంట్లు వచ్చాయంటే.. ఈమె ఎంత బాగా నటించిందనేది అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈమెతో యాంకర్ ప్రదీప్ లిప్ లాక్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అది నిజంగా కాదు లెండి.. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ట్రైలర్ లో అంతే..! నిజానికి అమృత అయ్యర్ మొదటి సినిమా అదే. గతేడాది మార్చిలోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ కరోనా కారణంగా లేట్ అయ్యింది. దాంతో ‘రెడ్’ సినిమా ముందుగా విడుదలయ్యింది.మొత్తానికి జనవరి 29న ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా కూడా విడుదల కాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా నిన్న ట్రైలర్ ను విడుదల చేశారు.

విజయ్ దేవరకొండ ఈ ట్రైలర్ ను విడుదల చెయ్యగా.. దీనికి మంచి రెస్పాన్సే లభించింది. మెయిన్ గా ప్రదీప్ – అమృత ల లిప్ లాక్ హైలెట్ గా నిలిచింది. స్టార్ యాంకర్ గా పేరొందిన ప్రదీప్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ లిప్ లాక్ మ్యాటర్ పై చర్చ నడుస్తుంది. ఇక ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాన్ని మున్నా డైరెక్ట్ చేసాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus