ఆ వీడియోలు చూసి బాగా నవ్వుకునే వాడిని : ప్రదీప్

బుల్లితెర మేల్ యాంకర్స్ లో ప్రదీప్, రవి లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రదీప్ ఈ మధ్య ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని.. కాబట్టి ఆయన్ని మేకర్స్ అంతా పక్కన పెట్టేస్తున్నారని… అందుకే చాలా రోజుల నుండీ ‘ఢీ’ షోలో కనిపించడం లేదని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అసలు విషయం అది కాదని… ప్రదీవ్ ఆరోగ్యం దెబ్బతిందని.. అందుకే ఇలా ‘ఢీ’ షో కి దూరమయ్యాడంటూ… మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక వీటన్నిటికీ చెక్ పెట్టాలని ప్రదీప్ ఫిక్సయ్యాడనుకుంట. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో చేసి ఆ వార్తలను ఖండించాడు.

ప్రదీప్ మాట్లాడుతూ… “షూటింగ్‌లో నా కాలికి గాయమయ్యింది. డాక్టర్లు నిలబడొద్దంటూ చెప్పారు. అందుకే రెస్ట్‌ తీసుకుంటున్నాను. మరొక్క వారంలో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాను. నా 10 సంవత్సరాల కెరీర్‌లో ఇప్పటివరకూ ఇంతపెద్ద బ్రేక్‌ ఎప్పుడూ తీసుకోలేదు. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాను. చాలా రోజుల తర్వాత దీపావళి అలాగే నా పుట్టిన రోజు వేడుకలని నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేశాను. నాకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. నెలరోజులు రెస్ట్‌.. అంటే బోర్‌ కొడుతుందనుకున్నా కానీ యూట్యూబ్‌ వీడియోలు, వాటి రివ్యూలు చూసి చాలా టైమ్‌పాస్‌ అయ్యింది. ‘క్షీణించిన ఆరోగ్యం’, ‘దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ’ అంటూ క్రేజీ వార్తలు ఉన్న వీడియోలను చూసి బాగా నవ్వుకున్నాను. కానీ అసలు మ్యాటర్ తెలీనివాళ్ళు కంగారుపడిపోతారు కదా. సో కాస్త నిజాలు తెలుసుకొని అప్పుడు వార్తలు రాయండి. త్వరలోనే ‘ఢీ’ షోలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుకు రాబోతున్నాను” అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.


తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus