Rashmi: మాల్దీవుల్లో మతిపోగొడుతున్న రష్మీ..సాలిడ్ కామెంట్‌తో రష్మీ పోస్ట్ చేసిన వీడియో వైరల్..!

  • November 14, 2022 / 10:15 PM IST

స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ రష్మీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. టీవీ షోల్లో అమ్మడు ఉంటే ఆ సందడే వేరంటుంటారు ఫ్యాన్స్.. అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా మెరుస్తుంటుంది.. ‘గుంటూరు టాకీస్’ మూవీలో ఘాటైన అందాలతో కుర్రకారు గుండెల్ని పిండేసి, ఇటీవల ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ వచ్చి మంచి హిట్ అందుకుంది.. షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడిపే రష్మీ ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్ నుండి కాస్త బ్రేక్ తీసుకుంది..

మాల్దీవులకి చెక్కేసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తోంది.. సోషల్ మీడియాలో రష్మీ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోషూట్స్, పర్సనల్ విషయాలన్నీ షేర్ చేస్తూ ఉంటుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారామెకి.. తను షేర్ చేసే గ్లామరస్ పిక్స్ కోసం కుర్రాళ్లంతా వెయిట్ చేస్తుంటారు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇటీవల ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ప్రమోషన్లలో రష్మీ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి..

ఇక మాల్దీవుల ముచ్చటకొస్తే.. చక్కటి సముద్రపు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ ఉన్న ఓ కిరాక్ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.. ఇంకేముంది.. క్షణాల్లో వీడియో వైరల్.. బ్లూ కలర్ టూ పీస్ బికినీలో వాటర్ కలర్‌లో కలిసిపోయి, ఆ తడి అందాల్లో సాగరకన్యలా మెరిసిపోతోంది.. నీటిలో మునిగి రెండు చేతులతో లవ్ సింబల్ చూపించింది.. ‘‘వన్స్ ఏ వాటర్ బేబీ.. ఆల్వేస్ ఏ వాటర్ బేబీ’’ అంటూ కామెంట్ చేసింది కూడా..

ఇక నెటిజన్లు మెదడుకి పదును పెట్టి క్రియేటివ్ కామెంట్స్ వదులుతున్నారు.. ‘‘నీళ్లల్లో జలకన్యలా ఉన్నావ్.. సాగరకన్యలా ఉన్నావ్.. హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోవు.. ఇలా కనుక స్క్రీన్ మీద కనిపించావంటే ఇక అంతే సంగతులు.. బొమ్మ బ్లాక్ బస్టర్‌లా బాక్సాఫీస్ బ్లాస్ట్ అయిపోతుంది’’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వీడియోకి వ్యూస్, లైక్స్, కామెంట్స్ అయితే ప్రవాహంలా వస్తున్నాయంటే నమ్మండి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus