కన్నీటి పర్యంతమైన యాంకర్ రష్మీ.. ఎందుకంటే..?

  • March 20, 2021 / 07:32 PM IST

ఈ మధ్య కాలంలో టీవీ ఛానెళ్లు రీల్ జోడీల లవ్ స్టోరీలను హైలెట్ చేస్తూ టీఆర్పీ రేటింగ్ లను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. బుల్లితెర పాపులర్ జోడీలలో ఒకటైన రష్మీ సుధీర్ జోడీ రీల్ కపుల్ కాగా ఈ జోడీ రియల్ కపుల్ కావాలని మనస్పూర్తిగా ఎంతోమంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఎక్స్టా జబర్దస్త్ షో ప్రోమోలో సుధీర్ పెళ్లి జరగగా రష్మీ బోరున ఏడ్చేయడం గమనార్హం. ​ప్రోమోలో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను సుధీర్ ను పిలవగా సుధీర్ పెళ్లికొడుకు గెటప్ లో దర్శనమిస్తాడు.

రామ్ ప్రసాద్ “పెళ్లా నీకు..?”, “మాకు చెప్పకుండా పెళ్లేంట్రా..? అని అడగగా సుధీర్ నా గురించి అందరికీ తెలుసని పొరపాటున మాట్లాడారంటే పెళ్లి క్యాన్సిల్ అవుతుందని అందుకే ఎవ్వరినీ పిలవలేదని చెబుతాడు. గెటప్ శ్రీను మమ్మల్నెందుకు పిలవలేదు అని సుధీర్ ను అడగగా రోజా మిమ్మల్ని అస్సలు పక్కన పెట్టుకోకూడదు అంటూ పంచ్ వేస్తారు. ఆ తరువాత రామ్ ప్రసాద్ గెటప్ శ్రీనుతో వాడు ఈ రేంజ్ కు రావడానికి చాలా కష్టపడ్డాడని.. ఆ కష్టంలో వీడితో పాటు రష్మీ కూడా ఉందని గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ రష్మీని సుధీర్ పెళ్లికి తీసుకొస్తారు.

రష్మీ కళ్లు తుడుచుకుంటూ బోరున ఏడుస్తున్నట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ సుధీర్ పెళ్లికి వస్తారు. అయితే ఆ తరువాత రష్మీ “కంగ్రాచ్యులేషన్స్ సుధీర్” అని చెబుతూ ఏడుస్తున్నట్టు మళ్లీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తారు. ఆసమయంలో గెటప్ శ్రీను ఆడపెళ్లి వాళ్లకు రష్మీ సుధీర్ ఒకరికొకరు క్లోజ్ అని.. కలిసి ఎన్నో ప్రదేశాలకు వెళ్లారని చెబుతాడు. ఈ ప్రోమోకు లక్షల సంఖ్యలో వ్యూస్ రాగా మార్చి 26వ తేదీ రాత్రి 9 : 30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.


చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus