Rashmi Gautam: ఆ జడ్జి బెస్ట్ జడ్జి అంటున్న రష్మీ గౌతమ్.. ఎవరి పేరు చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ స్టేటస్ ను అందుకున్న అతికొద్ది మంది యాంకర్లలో రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఒకరు. సుధీర్ (Sudigali Sudheer) రష్మీ జోడీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సుధీర్ రష్మీ కలిసి చేసిన షోలు సైతం ఊహించని స్థాయిలో క్లిక్ అయ్యాయి. తాజాగా ఒక సందర్భంలో రష్మీ గౌతమ్ మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. స్క్రీన్ పై పెయిర్ గా ప్రదీప్ (Pradeep Machiraju )తో చేయడం ఇష్టం అని రష్మీ పేర్కొన్నారు.

Rashmi Gautam

ప్రదీప్ నాకు యువ సీరియల్ సమయంలో పరిచయం అయ్యారని రష్మీ చెప్పుకొచ్చారు. ఆటో రామ్ ప్రసాద్ (Jabardasth Ram Prasad) ఎప్పుడూ జోక్స్ చెబుతూ ఉంటారని రష్మీ వెల్లడించారు. హైపర్ ఆది బాగా విసిగిస్తాడని ఆమె పేర్కొన్నారు. ప్రదీప్ బెస్ట్ ఎంటర్టైనర్ ప్రదీప్ అని ప్రదీప్ ఆల్ రౌండర్ అని అన్ని వర్గాల ప్రేక్షకులను ప్రదీప్ మెప్పిస్తారని రష్మీ అన్నారు. నా దృష్టిలో కామెడీ షోలకు బెస్ట్ జడ్జి రోజా (Roja) అని రష్మీ వెల్లడించారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంద్రజ  (Indraja) పర్ఫెక్ట్ అని ఆమె తెలిపారు.

మూడు ఆప్షన్లు ఇవ్వగా ప్రదీప్ కు ముద్దు ఇస్తానని చెంపదెబ్బ హైపర్ ఆదికి (Hyper Aadi) ఇస్తానని సుధీర్ కు వార్నింగ్ ఇస్తానని రష్మీ పేర్కొన్నారు. కరోనా సమయంలో నా తమ్ముడు జంతువులకు మేలు జరిగేలా చేసిన సాయం నేను మరవలేనని రష్మీ వెల్లడించడం గమనార్హం. మళ్లీ మూడు ఆప్షన్లు ఇవ్వగా సిద్ధు జొన్నలగడ్డతో (Siddu Jonnalagadda) పార్టీకి వెళ్తానని ప్రదీప్ తో ట్రిప్ కు వెళ్తానని షాపింగ్ కు సుధీర్ తో వెళ్తానని ఆమె అన్నారు.

ఒడిశాలో పొలం ఉంది కానీ 100 ఎకరాలు అనే వార్తల్లో నిజం లేదని రష్మీ పేర్కొన్నారు. టైమ్ ట్రావెలింగ్ ఆప్షన్ ఉంటే సుధీర్ తో లవ్ ట్రాక్ ఆపేస్తానని ఆమె అన్నారు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రష్మీ తెలిపారు. ఎవరి వల్ల ఎవరూ ఎదగరని ఎవరినీ ఎవరూ తొక్కరని ఆమె పేర్కొన్నారు.

‘డబుల్ ఇస్మార్ట్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus