Rashmi: రష్మీ గొప్పమనస్సుకు నెటిజన్లు ఫిదా.. ఏమైందంటే..?

శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు సైతం కన్నీళ్లు తెప్పిస్తోంది. రష్మీ యాంకర్ గా చేస్తున్న ఒక డ్యాన్స్ షోలోని కంటెస్టెంట్ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అ కంటెస్టెంట్ కు తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని రష్మీ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను కోరారు. డ్యాన్సర్ పవిత్ర అందరికీ సుపరిచితురాలేనని డబ్బులు లేకపోవడం వల్ల ఆమె ఆర్థిక ఇబ్బందులు పడుతోందని రష్మీ పేర్కొన్నారు.

సరైన వైద్యం అందక పవిత్ర తండ్రి ప్రాణాలు విడిచారని పవిత్రకు మనమంతా కలిసి సహాయం చేద్దామని రష్మీ వెల్లడించారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 3.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారని ప్రతి ఒక్కరూ ఒక్క రూపాయి చొప్పున ఇచ్చినా మనమంతా కలిసి కనీసం రెండు లక్షల రూపాయలు సాయం చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. కరోనా వల్ల అందరూ కష్టాల్లోనే ఉన్నారని రష్మీ గౌతమ్ వెల్లడించారు. అయితే పవిత్ర పరిస్థితి మనకంటే దారుణంగా ఉందని అందువల్ల అందరం కలిసి ఆమెకు మన వంతు సహాయం చేద్దామని ఆమె తెలిపారు.

అయితే రష్మీ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసిన తరువాత ఆమె ఫ్యాన్స్ తమ వంతు సహాయం చేశారు. రష్మీ భావించిన విధంగానే దాదాపు రెండు లక్షల రూపాయలు వచ్చాయి. ఆ మొత్తాన్ని రష్మీ పవిత్రకు అందజేశారు. ఒక మంచి పని చేయడానికి తమ వంతు సహాయం చేసిన వాళ్లందరికీ రష్మీ కృతజ్ఞతలు తెలిపారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus