రష్మీ గౌతమ్.. పరిచయం అవసరం లేని పేరు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించినా.. ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అయితే ‘జబర్దస్త్’ లో యాంకర్ గా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక ఈమె ఇమేజ్ బాగా పెరిగింది. అప్పటి నుండి ఓ పక్క సినిమాలు మరోపక్క టీవీ షోలతో ఈమె బిజీగా గడుపుతూ వస్తోంది. సుడిగాలి సుధీర్ తో ఈమె ప్రేమాయణం నడుపుతుంది అంటూ గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ ఆ ప్రచారం నడుస్తూనే ఉంది. అయితే మరోపక్క ఈమె లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకుంది అంటూ గుసగుసలు వినిపించాయి. అయితే తన పెళ్లి గురించి రష్మీ క్లారిటీ ఇచ్చింది లేదు. మరోపక్క ఆమె భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటుంది అంటూ ఇంకో ప్రచారం కూడా మొదలైంది. ‘సింగిల్’ స్టేటస్ ను ఈమె ఎంధుకు మెయింటైన్ చేస్తుంది అనేది పెద్ద మిస్టరీ. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. రష్మీ ఇప్పుడు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది. ఎక్కువ శాతం మాల్దీవులకు పెళ్లైన వారు వెళ్తుంటారు.
లేదంటే బాయ్ ఫ్రెండ్ తో అయినా సరే కలిసి వెళ్తుంటారు. మరి రష్మీ ఒంటరిగా వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసేది ఏమి ఉంటుంది. దీనికి సమాధానాలు దొరకడం కష్టం. అవి పక్కన పెట్టేస్తే.. మాల్దీవుల్లో రష్మీ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. తాజాగా ఆమె ఫాంటు లేకుండా వైట్ షర్ట్ మాత్రమే వేసుకుని హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :