వీధి శునకాల కోసం హాట్ యాంకర్ రష్మీ ఎంత కేరింగ్ తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. కరోనా – తొలి లాక్‌డౌన్ సమయంలో విశాఖపట్నంలోని చాలా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వీధి శునకాలకు ఆహారం పెట్టిందామె. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో జంతువుల విషయంలో ఆమె తన కేరింగ్‌నెస్‌ను చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్ సాయం కోరారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు గత కొంతకాలంగా
ఆ శునకాలకు వైద్య సిబ్బంది యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఆపరేషన్ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపై అలానే విడిచిపెడుతున్నారు. దీని వల్ల ఆ శునకాలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ‘సేవ్ యానిమల్స్ ఇండియా’ అనే ట్విటర్ ఖాతా ద్వారా ఓ నెటిజన్ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రష్మీ ఈ విషయమై స్పందించారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు. ఈ విషయంలో స్పందించగలరు అంటూ కోరారు. డైలీ టార్గెట్‌ను చేరుకోవడం కోసం వైద్య సిబ్బంది ఇలా నోరు లేని జీవాలను హింసించడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కేటీఆర్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి..!
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!