సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ : రవి

యాంకర్ రవి… అతి తక్కువ టైంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగాడు. ప్రదీప్ తర్వాత ఆ రేంజ్లో ఫ్యాన్ మరియు ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ రవినే అనడంలో సందేహం లేదు. ‘ఢీ’ అలాగే మా మ్యూజిక్ లో కొన్ని షోలతో మంచి పాపులర్ అయ్యాడు రవి. అప్పట్లో మరో యాంకర్ లాస్యతో రవి ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదు.. అని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు.

అటు తర్వాత… ‘పటాస్’ తో మంచి ఫామ్లో ఉన్న టైములో … ఆ షో నుండీ తప్పుకున్నాడు. శ్రీముఖి తో వివాదం కారణంగా ఆ షో నుండీ తప్పుకున్నాడు అని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని.. ఇంకా కొత్తగా ఏమైనా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఆ షో నుండీ తప్పుకున్నట్టు తెలిపాడు రవి. ఇప్పుడు సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి షో లు చెయ్యాలి అని ఆలోచన ఉన్నట్టు తెలిపాడు. ఈ క్రమంలో తన ఆస్తుల గురించి అడిగితే.

ఇప్పటి వరకూ నేను సేవింగ్స్ లో దాచుకుంది ఏమీ లేదు. నా ఫ్యామిలీని మైంటైన్ చెయ్యడానికే నా సంపాదన అయిపొయింది. నేను సంపాదించుకున్న దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. నా స్నేహితుడు ఒకడు నా దగ్గర 45 లక్షలు తీసుకుని హ్యాండ్ ఇచ్చాడు. వాడు చాలా అమాయకుడు..కనీసం స్మోక్ కూడా చెయ్యడు.. ఒకసారి అతని ఫ్యామిలీ కష్టాల్లో ఉంది అంటే.. ఏమీ ఆలోచించకుండా ఇచ్చేశాను. ఇప్పటికీ దానికోసం లీగల్ గా పోరాడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రవి.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus