‘ఎక్స్‌పోసింగ్’ పై..యాంకర్ ‘హాట్’ కామెంట్స్!!

ప్రస్తుతం వెండి తెరపై జరిగే వింతలకే కాదు, బుల్లి తెరపై జరిగే వాటికి కూడా ప్రాధాన్యత బాగా పెరిగిపోతుంది. సినీ స్టార్స్ విషయాల్లో మన ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో, అలాగే బుల్లి తెరపై కూడా అలాంటి ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ఇక అసలు కధకు వస్తే బుల్లి తెరపై యాంకర్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అందులో కొందరు యాంకర్స్ హాట్ హాట్ గా అందాలు చూపిస్తుంటే, మరికొందరు, సింపల్ స్మైల్ తో ఆకట్టుకుంటారు. ఇక సుమ, ఝాన్సీ, ఉదయ భాను, రవిత్రయని, ఇలా అందమైన యాంకర్స్ తరువాత, అందరికీ గుర్తుండిపోయే యాంకర్స్ లో శ్యామల ఒకరు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినా, సినిమాలో అవకాశాలు ఏమీ పెద్దగా రాలేదు. ఇక చేసేది ఏమీ లేక, బుల్లి తెరకు పరిమితం కాగా, ఇప్పుడు యాంకర్స్ లో ఒకానొక టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు. మరో పక్క సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్న ఈ భామకు, రేష్మి, అనసూయ లాగా పెద్దగా అవకాశాలు ఏమీ రాకపోగా, ఈ మధ్యనే ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో హీరో వాడిన పాత్రను పోషించింది. అంతేకాకుండా ఆమధ్య శౌర్యం సినిమాలో సైతం హీరోయిన అక్క పాత్రలో మెప్పించింది. ఇక అర, కోరా పాత్రలు తప్పితే మీరు ఐటమ్ సాంగ్స్ లో నటించారా అని మీడియా మిత్రులు అడిగినప్పుడు, తాను హోమ్లీ పాత్రలే చేస్తాను అని, డబ్బుల కోసం అందాలు ఆరబోయలేను అని ఘాటుగా చెప్పిందని సమాచారం. ఇక ఈ కామెంట్స్ విన్న మీడియా వాళ్ళు ఈమె రేష్మిని, అనసూయని టార్గెట్ చేసింది అంటూ చెవులు కొరుక్కున్నారట. ఏది ఏమైనా…దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా…..శ్యామలా ఆంటీ…ఆలోచించండి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus