యాంకర్ శ్యామల అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో నటించి పాపులర్ అయిన ఈమె తర్వాత సినిమాల్లో అవకాశాలు పొందింది. అయితే ఈమె సినిమాల్లో పెద్దగా రాణించింది ఏమీ లేకపోవడంతో బుల్లితెర పైనే బిందాస్ గా సెటిల్ అయ్యింది. పలు సినిమా ఫంక్షన్స్ ను హోస్ట్ చేస్తూనే, సినీ నటీనటులను ఇంటర్వ్యూలు చేయడం వంటివి చేస్తుంది.
మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిన్న ప్రపంచమంతా వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటే.. ఈమె తన భర్త నరసింహతో కలిసి తమ పెళ్లి రోజుని కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా శ్యామల ఫ్యామిలీ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :