Anchor Shyamala: బెయిల్ పై బయటకు వచ్చి శ్యామల భర్త హల్ చల్..!

  • April 30, 2021 / 03:36 PM IST

ఇటీవల శ్యామల భర్తను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మ‌హిళ దగ్గర 1 కోటి రూపాయల వరకూ డబ్బు తీసుకుని.. ‘తిరిగి చెల్లించమని అడిగితే లైంగిక దాడి చేసాడని’ ఆ మహిళ కేసు పెట్టింది. శ్యామల భర్త లక్ష్మీ నరసింహారెడ్డితోపాటు అతనికి సాయం చేసిన జయంతి గౌడ్‌ అనే మహిళను కూడా పోలీసులు అరెస్టు చెయ్యడం జరిగింది. అయితే తాజాగా బెయిల్‌ పై బయటకి వచ్చాడు శ్యామల భర్త నరసింహారెడ్డి. వచ్చి రాగానే ఓ వీడియో ద్వారా ఈ విషయం పై స్పందించాడు.

ఈ వీడియోని అతని భార్య మరియు ప్రముఖ యాంకర్ అయిన శ్యామల.. తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా నరసింహరెడ్డి మాట్లాడుతూ.. “గత రెండు రోజులుగా నా పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పై స్పందించడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. కేవలం రెండు రోజుల్లో నేను మీ ముందుకు వచ్చానంటే మీరు అర్ధం చేసుకోవచ్చు అది తప్పుడు కేసు అనేది..! అయిన‌ప్ప‌టికీ కొంతమంది నాకు అండగా నిలిచారు. వారందరికీ నా కృతజ్ఞతలు.

దేవుడి దయ వల్ల నేను ఇంటికి తిరిగి వచ్చాను.ఈ కేసు గురించి పూర్తి వివరాలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.మన పై ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు..అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పై ఉంటుంది. కాబట్టి పూర్తి ఆధారాలతో మీ ముందుకు వస్తాను. నాకు న్యాయం, న్యాయస్థానం పై పూర్తి నమ్మకం,గౌరవం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.


Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus