శివాజీరాజాని ఇబ్బంది పెట్టిన యాంకర్ శ్యామల..!

నిహారిక నటించిన తాజా చిత్రం ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్ శ్యామల ప్రవర్తనకి అందరూ షాకయ్యారు. అంతే కాదు ఆమె పై సోషల్ మీడియాలో నెటిజన్స్ భారీ ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ తలబడ్డాయి. ఇందులో శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే శివాజీ రాజా ఓడిపోయాడు. అయితే యాంకర్ శ్యామల మాత్రం శివాజీ రాజా గెలిచాడని కృతజ్ఞతలు చెబుతుంది.

వివరాల్లోకి వెళితే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్యామల ‘సూర్యకాంతం’ టైటిల్ కాన్సెప్ట్‌లో భాగంగా ‘మీ జీవితంలో మీరు చూసిన సూర్యకాంతం ఎవరు’? అంటూ కార్యక్రమానికి హాజరైన అతిథుల్ని శ్యామల ప్రశ్నిస్తూ వారి నుండీ కొన్ని విచిత్ర సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది. అలా అందరినీ అడుగుతూ శివాజీ రాజా వద్దకు వచ్చింది. వచ్చిన వెంటనే.. ‘మా ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కంగ్రాట్స్’ అంటూ శివాజీ రాజాని పలకరించింది. ఆమె ఇలా అడగడంతో అందరూ ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అక్కడితో ఆగలేదు.. ‘మీరు గెలిచిన తర్వాత ఇదే మొదటి ఫంక్షన్ కదా’ అంటూ శివాజీ రాజా ని అడగడంతో ఆయనకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. దీంతో శివాజీ రాజా.. ‘గెలిచింది నేను కాదమ్మా .. నేను ఓడిపోయా. నా టీంలో మాత్రం కొందరు గెలిచారు’ అంటూ ఇబ్బంది పడుతూ చెప్పాడు. అక్కడికీ శ్యామల ఆగలేదు.. ‘మీ టీంలో వారు గెలిస్తే మీరు గెలిచినట్టే’ అంటూ ఏదేదో మాట్లాడేసింది. ఇప్పుడు ఈ విషయమై శ్యామల ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. “చిత్ర పరిశ్రమలో ఉండి కూడా… ‘మా’ ఎన్నికల్లో ఎవరు గెలిచారో… తెలీనంత అజ్ఞానంలో ఉన్నారా” అంటూ శ్యామల పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus