Soumya Rao: జబర్దస్త్ కు అలా సెలెక్ట్ అయ్యానన్న సౌమ్య.. ఏం చెప్పారంటే?

ఈటీవీలో పలు సీరియళ్లలో నటించిన సౌమ్యారావు జబర్దస్త్ షో ద్వారా ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు. జబర్దస్త్ షోకు ఒక ఎపిసోడ్ కు 80,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. జబర్దస్త్ షో ద్వారా సౌమ్య పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. ఇతర ఈవెంట్లలో కూడా సౌమ్యా రావు సందడి చేస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. సౌమ్య పంచ్ లు కూడా అద్భుతంగా ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈటీవీలో భలే మంచిరోజు అనే ఈవెంట్ లో నేను పాల్గొన్నానని ఆ ఈవెంట్ నా మొదటి స్టేజ్ షో అని సౌమ్య చెప్పుకొచ్చారు. ఆ షోలో నేను ఫన్నీగా మాట్లాడిన మాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె కామెంట్లు చేశారు. ఆ షో చూసిన జబర్దస్త్ షో మేకర్స్ నా గురించి తెలుసుకుని కాల్ చేశారని సౌమ్య అన్నారు. నాకు కాల్ వచ్చే సమయానికి జబర్దస్త్ షో అంత పెద్ద షో అనే విషయం నాకు తెలియదని ఆమె కామెంట్లు చేశారు.

యాంకర్ గా చేస్తారా అని కాల్ రాగా నేను మొదట ఎవరో కావాలని కాల్ చేశారని అనుకున్నారని ఆ తర్వాత నిజంగానే మల్లెమాల టీమ్ నుంచి కాల్ వచ్చిందని నాకు అర్థమైందని సౌమ్య అన్నారు. ఆ తర్వాత నాకు తెలుగు రాదని నేను చెప్పానని అయితే నా తెలుగు ప్రెట్టీగా ఉందని అడిషన్ కు రావాలని ఆమె కామెంట్లు చేశారు. నాలుగు క్యాస్టూమ్స్ లో నన్ను టెస్ట్ చేశారని సౌమ్యా రావు వెల్లడించారు.

కెమెరాల ముందు నవ్వమని అడగగా నేను నవ్వానని ఆమె కామెంట్లు చేశారు. రష్మీ, అనసూయ సూపర్ గా డ్యాన్స్ చేస్తారని వాళ్లలా డ్యాన్స్ చేయడం రాదని సౌమ్య పేర్కొన్నారు. ఆ తర్వాత నాకు జబర్దస్త్ షోలో ఛాన్స్ ఇచ్చారని ఆమె తెలిపారు. ప్రస్తుతం డ్యాన్స్ నేర్చుకుంటున్నానని త్వరలో మంచి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇస్తానని ఆమె కామెంట్లు చేశారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus