Sreemukhi: వామ్మో…పులులతో ఆటలేంటి శ్రీముఖి.. తేడా కొడితే అంతే?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె సుమారు అరడజనకు పైగా కార్యక్రమాలను చేస్తూ బుల్లితెరను ఏలుతున్నారు. ఇలా బుల్లితెర ద్వారా భారీ స్థాయిలో సంపాదిస్తున్నారని చెప్పాలి.వారంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఈమె బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూనే మరోవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం పలు సినిమాలకు కమిట్ అవుతున్నారు.

ఇలా శ్రీముఖి బుల్లితెరపై వెండితెరపై కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడే శ్రీముఖి ఎంతో ధైర్యవంతురాలు అనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరోసారి శ్రీముఖి తన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ఈమె తన బర్త్ డేను వేడుకల కోసం థాయిలాండ్ వెళ్లిన శ్రీముఖి ఫుకెట్ నగరంలో గల జూ పార్క్ సందర్శించారు.

అక్కడున్న పెద్ద పులిని తాకుతూ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పులులతో శ్రీముఖి ఆటలు ఆడటంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలపై స్పందించినటువంటి పలువురు నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

శ్రీముఖి (Sreemukhi) ధైర్యానికి ఏదైనా లొంగాల్సిందే అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు మాత్రం ఏదైనా తేడా కొట్టింది అంటే అంతే సంగతులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus