కేటీఆర్ తో సుమ.. మ్యాటరేంటో..?

కొన్నేళ్లుగా బుల్లితెర మహారాణిలా చెలామణి అవుతోంది యాంకర్ సుమ. ఆమె కామెడీ టైమింగ్, చమత్కారం, మాట తీరు ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంత పెద్ద ఈవెంట్ అయినా.. అందులో సుమ ఉండాల్సిందే. టీవీ షోలు. ఈవెంట్ లు ఇలా బిజీగా గడిపే సుమ.. రీసెంట్ గా తెలంగాణ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కేటీఆర్ తో సంభాషిస్తున్న ఫోటోను సైతం షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. సాధారణంగా తన షోలలో నాన్‌స్టాప్‌గా ఏదొకటి మాట్లాడుతూ ఉంటానని.. కానీ నాయకత్వ హోదాలో మీరు మాట్లాడేది ఎంతో విలువైనది.. మీ నిబద్ధత, మాట్లాడే విధానం అద్భుతం అంటూ కేటీఆర్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. సుమ చేసిన ట్వీట్ కి కేటీఆర్ కూడా స్పందించడం విశేషం. అయితే ఇంత సడెన్ గా సుమ.. కేటీఆర్ ని ఎందుకు కలిసిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గ్రేటర్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్.. సుమని కలిసి ఉంటారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. సుమపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఆమెని ప్రచారానికి వాడుకోవడం కోసం కలిసి ఉంటారనే మాటలు వినిపిస్తున్నాయి. కొందరు సుమను కలవడం కేటీఆర్ అదృష్టం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున క్యాంపెయినింగ్‌ చేయనున్నారా? అంటూ సుమని నేరుగా ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై సుమ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి!


Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus