ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన శ్యామల.. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో నటించేది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఆశించిన బ్రేక్ రాలేదు. దీంతో ఈమె బుల్లితెర పైనే సెటిల్ అయిపోయింది. మరోపక్క పలు సినిమా ఈవెంట్ లకు అలాగే ఇంటర్వ్యూలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తోంది. మధ్యలో బిగ్ బాస్ సీజన్ 2.. లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక శ్యామల.. సీరియల్స్ చేసే టైంలోనే యాక్టర్ నరసింహని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఈ దంపతులకు ఓ బాబు కూడా జన్మించాడు. ఇదిలా ఉండగా.. శ్యామల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె శారీ పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె స్లీవ్ లెస్ గా కనిపిస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :