రొమాన్స్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన యాంకర్ శ్యామల

లేడి యాంకర్స్ ట్రెండ్ రోజురోజుకు ఎంతగానో మారుతోంది. టివి ప్రోగ్రామ్ లతోనే కాకుండా యూ ట్యూబ్ ద్వారా కూడా ఆడియెన్స్ కు సరికొత్తగా దగ్గరవుతున్నారు. ఇక అలాంటి వారిలో శ్యామల ఒకరు. బిగ్ బాస్ సీజన్ 2లో ఎలిమినెట్ అయినా కూడా మరోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శ్యామల ఓ రకంగా మంచి క్రేజ్ అయితే అందుకుంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్యను గట్టిగానే పెంచుకుంటోంది. ఇక ఇటీవల అమ్మడు తన యూ ట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియో పోస్ట్ చేసి సరికొత్తగా ఆకట్టుకుంది.

‘ఏం చెప్పారు శ్యామల గారు’ అనే యూ ట్యూబ్ ఛానెల్ ను సరికొత్తగా నడిపిస్తున్న శ్యామల ఇటీవల తన భర్తతో కలిసి తీసిన ఒక సాంగ్ వీడియోను పోస్ట్ చేసింది. కంటెంట్ బేస్డ్ టైప్ తో వీడియోను షూట్ చేసిన ఆమె మ్యారేజ్ లైఫ్ జీవితాన్ని ఒక సాంగ్ తో ప్రజెంట్ చేసింది. భర్తతో రోమాంటిక్ గా నవ్వుతూ కనిపించడమే కాకుండా ప్రేమ, పెళ్లి, కొడుకు పుట్టడం వరకు వారి మధ్య ప్రేమ ఏ రేంజ్ లో ఉందొ ఆ వీడియో ద్వారా ప్రజెంట్ చేశారు. భర్త కూడా శ్యామలతో రొమాంటిక్ స్టిల్స్ ఇచ్చాడు.

యాంకర్ శ్యామల, టీవీ నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దల మద్దతు దక్కకపోయినా కూడా కొన్నాళ్ళు దూరంగా ఉన్న ఆమె కొడుకు పుట్టిన తరువాత మళ్ళీ వాళ్ళకు దగ్గరయ్యింది. ఇక శ్యామల పోస్ట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.


ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus