రామ్ పోతినేని కథానాయకుడిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. నవంబర్ 27న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. వివేక్ మెర్విన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో రిలీజ్ కి ముందు అన్ని పాటలు జనాల్లోకి వెళ్లిన ఆల్బమ్ అంటే కచ్చితంగా అది ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే చెప్పాలి. టీజర్, ట్రైలర్స్ వంటివి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవల ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకు, స్నేహితులకు చూపించారు నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు. సినిమా చూసిన వాళ్ళు తర్వాత అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
వారి టాక్ ప్రకారం.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం 2 గంటల 46 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. సాగర్(రామ్ పోతినేని) సూర్య(ఉపేంద్ర) అనే స్టార్ హీరోకి వీరాభిమాని. తన అభిమాన హీరో కోసం కాలేజీలోని తోటి స్టూడెంట్స్ తో గొడవ పెట్టుకోవడం, థియేటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాయడం.. ఇంట్లో బాధ్యతలను కూడా పక్కన పెట్టడం.. ఇది అతని లైఫ్ స్టైల్. అయితే ఒకరోజు థియేటర్ యజమానితో ఇతనికి పెద్ద గొడవ జరుగుతుంది. తర్వాత తన ఊరికి ఒక సమస్య వచ్చి పడుతుంది. ఆ సమస్య తీర్చేందుకు ఏ రాజకీయ నాయకుడు రాడు. కానీ తన అభిమాని కోసం ఓ హీరో కదిలి వస్తాడు? అంతలా హీరో కదిలి వచ్చి.. అభిమాని ఊరికి సాయం చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? అనేది మిగిలిన కథ అని తెలుస్తుంది.
సినిమా కథ నేటి యువతను ఆలోచింపజేసేలా ఉంటుందట. చాలా డైలాగులు ఇప్పటి స్టార్ హీరోల అభిమానులు రిలేట్ చేసుకునే విధంగా ఉంటాయట. కచ్చితంగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రామ్ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.అలాగే హీరోయిన్ భాగ్యశ్రీకి కలిసొస్తుందని అంటున్నారు.ఇద్దరికీ కూడా హిట్టు చాలా ముఖ్యం. చూడాలి మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.