ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ‘ది వారియర్’ ‘స్కంద’ ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో అతని మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. ప్రస్తుతం ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మధ్యనే రాజమండ్రిలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా రామ్, ఉపేంద్రలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో స్పెషల్ గా ఓ సెట్ వేసినట్టు తెలుస్తుంది.
తాజా షెడ్యూల్ లో రామ్, భాగ్యశ్రీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నైట్ షూట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇదే సెట్ లో డే టైంలో కూడా కొన్ని కీలక షెడ్యూల్స్ ని నిర్వహిస్తున్నారట. క్లైమాక్స్ కూడా ఇక్కడే చిత్రీకరిస్తారట.
సో నెల రోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవడం గ్యారెంటీ అని తెలుస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదొక పీరియాడిక్ మూవీ. సినిమా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుంది. అలాగే రాజకీయ అంశాలు కూడా టచ్ చేస్తారని తెలుస్తుంది.