పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన చిత్రం “సూపర్”. ఈ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనుష్క తరువాత కాలంలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. అయితే సూపర్ సినిమా షూటింగ్ లో పూరి జగన్నాధ్ అనుష్క అనే పేరును స్క్రీన్ నేమ్ గా యాడ్ చేయటం, అలా అలా స్వీటీ కాస్త అనుష్క గా పేరు పడిపోయింది. అయితే అనుష్క బిహేవియర్ గురించి ఒకసారి పూరి మాట్లాడుతూ తను చాలా మంచి మనసు గల వ్యక్తి అని, సెట్స్ లో తనని అమ్మ అని పిలిచేవాణ్ణి అని తెలిపారు.
ఈ విధంగా ఎవర్ని అనుష్క గురించి అడిగినా తన మంచితనం గురించి ప్రశంసిస్తుంటారు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పంచాక్షరీ చిత్ర నిర్మాత అనుష్క గురించి మాట్లాడుతూ షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు అతని దగ్గర కేవలం 2.5 లక్షలు మాత్రమే ఉన్న సందర్భంలో నిర్మాత పరిస్థితి అర్ధం చేసుకొని, అనుష్క తన పాత్రకి సంబందించిన కాస్ట్యూమ్ తానే స్వయంగా తన సొంత డబ్బులతో కొనుక్కున్నట్లు తెలిపారు.
దీని బట్టి అర్ధం అవుతుంది అనుష్క యొక్క గుణం ఎంత గొప్పదో, అందంతో పాటు ఇంత గొప్ప గుణాలు కలిగి ఉండటం చాలా అరుదు. అప్పట్లో తెలుగు లో విజయ శాంతి తరువాత మళ్లి అనుష్క అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కొత్త ఊపును తీసుకువచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఆ మూవీ ద్వారా లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క తరువాత పంచాక్షరీ, బాగమతి మూవీలు చేసిన సంగతి తెలిసిందే.