Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజర్, ట్రైలర్, ముఖ్యంగా పాటలు వంటివి ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో నవంబర్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. హీరో రామ్ ని కూడా కొన్నాళ్లుగా ప్లాప్..లు వెంటాడుతున్నాయి.

Andhra King Taluka Twitter Review

ఈ నేపథ్యంలో అతను హిట్టు కొట్టడం చాలా అవసరం. అందుకే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. కొంతమంది సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వెంకీ అనే అతను పెట్టిన రివ్యూ మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది.

అతని రివ్యూ ప్రకారం…’ఆంధ్రా కింగ్ తాలూకా’ సంతృప్తినిచ్చే ఫ్యానిజం/ప్రేమ కథా చిత్రం అని పేర్కొన్నాడు. కొంచెం ఊహించినట్టుగా అనిపించినా సాగదీసినట్టు అనిపించినా డీసెంట్ ఫీల్ తో కథనం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాడు. ఫ్యాన్ ట్రాక్ అలాగే ప్రేమ కథని దర్శకుడు పెర్ఫెక్ట్ గా సింక్ చేశాడట. ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయట.

డైరెక్టర్ మహేష్ బాబు మరో ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడని.., అయితే నెరేషన్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుంటే ఇంకా బాగుండేదని తెలిపాడు. రామ్ తన ఎనర్జీతో సాగర్ పాత్రని ఈజీగా క్యారీ చేశాడని, ఉపేంద్ర కూడా స్టార్ హీరో పాత్రకి న్యాయం చేశాడని అలాగే రావు రమేష్ కూడా బాగా చేశాడని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఓ జెన్యూన్ అటెంప్ట్ అని కూడా చెప్పాడు.

మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయో చూడాలి :

రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus