సీనియర్ హీరో శివాజీ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి.. మంచి కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 90’S(వెబ్ సిరీస్),బిగ్ బాస్ 7, కోర్ట్ వంటి ప్రాజెక్టులతో శివాజీ మళ్ళీ పుంజుకున్నారు. మరోవైపు సామాజిక అంశాలపై శివాజీ చేసే కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. మొన్నటికి మొన్న ‘దండోరా’ ట్రైలర్ లాంచ్ వేడుకలో సినిమా టికెట్ రేట్ల గురించి, ఐ బొమ్మ రవి గురించి, పాప్ కార్న్ రేట్ల గురించి శివాజీ తనదైన శైలిలో స్పందించి హాట్ టాపిక్ అయ్యారు.
ఇప్పుడు ‘వారణాసి’ విషయంలో రాజమౌళి ఎదుర్కొంటున్న వివాదంపై కూడా స్పందించి హాట్ టాపిక్ అయ్యారు.శివాజీ మాట్లాడుతూ.. “సినిమా టికెట్ రేట్ల గురించి తెగ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పండగ టైంలో సినిమా టికెట్లు వంద రూపాయలు పెంచితే తెగ నిరసన వ్యక్తం చేస్తారు. మరి ట్రావెల్స్ బస్సుల్లో టికెట్లు వెయ్యి,2 వేలు పెంచినా మాట్లాడరు. అంతేకాదు మొన్న హనుమంతులు వారి గురించి ఏదో మాట్లాడారని ఆయన్ని(రాజమౌళి) పై అంతా నోరేసుకుని పడిపోయారు.
గుండెలు బాదేసుకుంటూ కేసులు కూడా వేశారు. మరి శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని SIT సాక్ష్యాలతో ప్రూవ్ చేసింది కదా! మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు. వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదు.?అలాంటి విషయాలు పట్టించుకోరు.ఎందుకంటే అలాంటి విషయాల వల్ల వీళ్ళకి పాపులారిటీ రాదు. మరో రకంగా భయం అని కూడా చెప్పొచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లపై రాళ్లు వేస్తె పాపులారిటీ వచ్చేస్తుంది. వాళ్ళే సాఫ్ట్ టార్గెట్ వీళ్ళకి” అంటూ మండిపడ్డారు.