Andrea Jeremiah: పెళ్లి గురించి ఆండ్రియా షాకింగ్ కామెంట్స్.. ప్రతి అమ్మాయికి వస్తుందంటూ?

టాలీవుడ్, కోలీవుడ్ ఇతర ఇండస్ట్రీలలో ఆండ్రియాకు మంచి గుర్తింపు ఉంది. ఆండ్రియాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుంది. సింగర్ గా, నటిగా ఆండ్రియా గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం. పెళ్లి గురించి ఆండ్రియా మాట్లాడుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఒక వయస్సు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ప్రతి అమ్మాయికి వస్తుందని ఆండ్రియా తెలిపారు. అలాంటి ఆలోచన నాకు కూడా 30 సంవత్సరాల వయస్సులో వచ్చిందని ఆండ్రియా చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఆ వయస్సు దాటిపోయిందని ఆమె పేర్కొన్నారు. అయినా ఇలా ఉండటం వల్ల తనకెలాంటి బాధ లేదని ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని ఆండ్రియా కామెంట్లు చేశారు. తుప్పరివాలన్, మరికొన్ని సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించి ఆండ్రియా వెల్లడించారు. ఆండ్రియా రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. ఆండ్రియా ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతున్నారు.

ఆండ్రియా వాయిస్ కు సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం పిశాచి2 సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. పిశాచి2 సినిమాలో ఈ బ్యూటీ బోల్డ్ సీన్స్ లో నటించారని వార్తలు వినిపించాయి. అయితే ఆ సీన్స్ ను తర్వాత రోజుల్లో తొలగించారని భోగట్టా. రాబోయే రోజుల్లో ఆండ్రియా కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

పిశాచి2 మూవీ ఎప్పుడు థియేటర్లలో విడుదల కానుందో తెలియాల్సి ఉంది. ఛాలెంజింగ్ రోల్స్ లో నటించడానికి ఆండ్రియా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది ఆండ్రియా మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. ఆండ్రియా రేంజ్ అంతకంతకూ పెరగాలని నెక్స్ట్ లెవెల్ పాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆండ్రియాను (Andrea Jeremiah) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus