Anil Kapoor: ఆయన లేకపోతే నేను లేను అనిల్ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి యానిమల్ సినిమాలో సీనియర్ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా ద్వారా ఈయన దాదాపు 43 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించగా ఈ కార్యక్రమంలో అనిల్ కపూర్ కూడా సందడి చేశారు.

ఇందులో భాగంగా ఆయన (Anil Kapoor) మాట్లాడుతూ తన సినీ కెరియర్ గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ వేడుకలో అనిల్ కపూర్ తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను హీరోగా చేసింది తెలుగు వారేనని తెలియజేశారు.ప్రముఖ దివంగత దర్శకుడు బాపుగారు నన్ను హీరోగా తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారని ఈయన వెల్లడించారు.

బాపుగారు లేకపోతే నేను లేనని అనిల్ కపూర్ తెలిపారు. ఇలా తన మొదటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నేను తిరిగి 43 సంవత్సరాలు తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని వెల్లడించారు. రష్మిక అదృష్టం నా తెలుగు రీ ఎంట్రీకి కూడా కలిసి రావాలి అంటూ ఈయన మాట్లాడారు.

అలాగే రాజమౌళి గురించి మాట్లాడుతూ అన్ని చిత్ర పరిశ్రమలను ఏకం చేసిన గొప్ప డైరెక్టర్ మీరు మీలాంటి వారు ఇండస్ట్రీకి ఎంతో అవసరం అంటూ కూడా అనిల్ కపూర్ రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈయన రణబీర్ కపూర్ మహేష్ బాబుతో కలిసి పోకిరి సినిమాలోని డోలె డోలే అనే పాటకు డాన్స్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus